స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..

స్నేహహస్తం చాచని హృదయం ఉండదు. స్నేహితులు లేని మనుషులు ఉండరు. మనకు అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను నిర్ణయించుకునే అధికారం లేదు. చివరకు అమ్మనాన్నలను కూడా పైవాడే నిర్ణయిస్తాడు. కాని స్నేహితులను పొందే అవకాశం అంటే ఎంపికచేసుకునే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉంది. స్నేహాన్ని కొనసాగిస్తూ.. దాన్ని అద్భుత అనుభవంగా మలచుకునే అవకాశం కూడా మనకుంది. అలాంటి స్వచ్చమైన స్నేహశీలురం కలిసాము డజనుమంది. దాదాపు ఐదేళ్ల స్నేహం. యోగా కలిపింది. మా స్నేహాన్ని. ఇందిరాపార్కు అందించింది. ఈ స్నేహబృందాన్ని. స్నేహం అనగానే అందరి ఆలోచనలు ఒకేలా ఉండాలని.. ఒకటే భావాలుండాలనుకుంటే పప్పులో కాలేసినట్లే. మా అందరివి విరుద్ధ ఆలోచనలే. విరుద్ద రుచులు. ఒకరికి ఆవకాయ అంటే ఇష్టం. మరొకరికి రోటిపచ్చడి. మరికొందరు ఘాటు ఘాటు మసాలా రుచులు. ఇంకొకరు బాబోయ్ నానో ్వజ్ మాటలు ఎత్తకండని ముఖం చిట్లిస్తారు. అయినా అందరం కలిస్తే విరిసేది స్నేహాల్లరే. నెలకోసారి అలా అల్లరి చేసుకోడానికి ఎవరొకరి ఇంట్లో చేరిపోతాం . ఒక మొదలవుతుంది గోల. తొలుత వచ్చినవాళ్లంతా ఒకరికి ఒకరికి హగ్గులిచ్చుకుంటూ హాస్యపు మాటలతో ఆహ్వానాలు పలుకుతాం. తరువాత టాపిక్లు ఎటుపోయి ఎటు కాలేసినట్లే. వెళుతుందో తెలీదు. టీంలీడర్ క్షీరజ 'ఏయ్.. టైమ్ కి రానివాళ్లకు ఫైన్ ఏస్తా.. అందరూ లేటేనా..' అంటుంటే నవ్వుకుంటూ 'నేనే మరికొందరు ముందు వచ్చా.. కాదు నేనంటూ పోట్లాట'.. కొంత సేపటికి తంబోలా మొదలవుతుంది. ఇక అసమయంలో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. ఏంటో ఆస్తులు పోతున్నాయన్న ఫీలింగ్ దెబ్బలాటలు. పెద్ద పెద్ద అరుపులు.. పోట్లాటలు. ఇందులో సుజాత, శోభలు ఉంటే ఆ ఆనందమే వేరు. పెద్ద పెద్దగా అరుపులతో సాగుతుంది ఆట. రెండు, మూడుసార్లు ఒకరికే డబ్బులొచ్చాయా ఇక అంతా నీకేనా అంటూ గోల. ఇంతకీ పోయేది.. వచ్చేది యాభై, వందే. అయినా పోతే ఎంత బాధ. అస్సలు రాలేదంటూ వేదన. అవును మరి వందలు, వేలు చీరలకు తగలేస్తున్నా.. టైలర్లకు ఇస్తున్నా.. ఏమనిపించదు. అదేంటో మరి తంబోలాలో పెట్టిన యాభై తిరిగి రాకపోతే బలే బాదేస్తుంది. డబ్బుల రాకపోతే శోభగోల చూడలేం. ఎలాంటి గోల లేకుండా సైలెంట్ గా నెంబర్లు ప్రకటిస్తుంది. శ్రీదేవి. ఇక జ్యోతి చెట్టున్న నెంబర్లు చూసుకోకుండా డబ్బులు కూడా చూసుకోకుండా డబ్బులు పోగొట్టుకుంటుంది. లంచ్ టైమవుతుంది. ఇంతలో. రండి తినేసాక మళ్లీ పిలుపులొస్తాయి. ఇక కొసరి కొసరి వడ్డించే స్నేహితుల వడ్డింపులకు భుక్తాయాసంతో తిరిగి చేరతాం. మాలతి అయితే తినేది కొంచెమే కాని తినగానే మాత్రం పడక కావాలి. ఒక్కడో వాలిపోతుంది. కొద్దిసేపైనా అలా చేస్తే అమెకు హుషారు. కొద్ది సేపు రెస్ట్ తో ఇక పాటలు పెట్టండి కొద్ది సేపు డ్యా న్స్ అంటారెవరో. రెడీ అయిపోతాం. శోభకు ఐటంసాంగ్స్ అయితే హుషారు. ఏపాటెనా ఒకటే సెప్. ఎవరెలా చేసినా పట్టింపే లేదు. అది ఎంతసేపు సాగుతుందనేది లెక్కేలేదు. డ్యా ను ఇష్టపడని వాళ్లను కూడా గుంపులోకి లాగేయడమే. ఇష్టమొచ్చినట్లు శరీరాన్ని ఆడిస్తూ ఊగిపోతుంటే ఆ కిక్కే వేరు. మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మధ్యలో వేడి వేడి ఐజీలో.. ఏవొకటి స్నాక్స్ వస్తుంటాయి. తింటూనే ఫొటోలకు రెడీ అయిపోతాం. ఆ ప్రోగ్రాం మాత్రం వాసంతిదే. అందంగా ఇళ్లకు డిజైన్ చేసే వృత్తిలో ఉన్న వాసంతా ఫొటోలకు అంతే అందంగా ఫోజులు పెట్టిస్తుంది. రకరకాల ఫోజులు. ఒళ్లో వాలిపోయి.. ఒకరికపై ఒకరు పడిపోయి దిగే ఫొటోలతో పార్టీ చివరికి వస్తుంది. అయిపోయాక ఒకరికి ఒకరు బైలు చెప్పుకుని మళ్లి ఎవరింట్లో కలుసుకోవాలో నిర్ణయించుకుంటూ విడిపోతాం


. -విజయ