ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీగా ఉండటం బదులు ప్రజలనే ఎప్పుడూ ప్రభుత్వాలకి జవాబుదారీ చేసే ప్రయత్నం ప్రజాస్వామ్యానికే విరుద్ధం. విజ్ఞత ఉన్న ప్రభుత్వం అయితే పౌరసత్వ చట్టాన్ని ఉపసహరిం చుకోవాలి. ఇది అనవసరమే కాదు దేశానికి ఆ కూడా. స్వతంత్ర మొచ్చిన ఏడు దశాబ్దాల తరువాత ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వం కొత్తగా పౌరసత్వ చట్టాల సవరణలు తెచ్చింది. ముస్లింలకు వేరే దేశాలు వున్నాయి కాబట్టి ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని చెప్పుతోంది. అంతే కాక, 130 కోట్ల ప్రజలందరి పౌరసత్వాన్ని సాక్ష్యాల ఆధారంగా పరీక్షించి అసలుసిసలైన భారతీయ పౌరుల్ని గుర్తిస్తామని అంటోంది. సరైన పత్రాలు లేని వారిని అనుమానాస్పద పౌరులుగా పరిగణించి, వారి ప్రాథమిక మానవ హక్కులు? ఓటు హక్కు, ఆస్తి హక్కు, ఇతర అన్ని హక్కులని రద్దు చేసి వారిని చట్టపరిధి బయట వుండే ప్రత్యేక క్యాంపుల్లో పెడతామని హెచ్చరిస్తోంది. వారిని ఇతర దేశాలనుండి దొంగతనంగా వచ్చిన చొరబాటుదారులుగా పరిగణిస్తామని, వీలయితే ఆయా దేశాలకి పంపించేస్తామని చెబుతోంది. మరి పాలకుల తీరుతెన్నులు దేశమంతా భయాం దోళనలు కలిగించి నిరసనలకు తెర తియ్యటంలో ఆశ్చర్యమే ముంది? ఈ జాతీయ జనాభా పట్టికకూ ప్రతి పదేళ్లకూ జరిగే జనాభా లెక్కలతో సంబంధం లేదు. అవి వేరుగా జరుగుతాయి. జనాభా లెక్కలకి స్వచ్ఛందంగా వివరాలు ఇవ్వొచ్చు. కానీ జనాభా పట్టికకి అందరూ వివరాలు ఇవ్వటం తప్పనిసరి. అంతే కాక, దీని ప్రధాన ఉద్దేశం జాతీయ పౌరసత్వ జాబితాకు మూల వనరుని, భూమికని ఏర్పర్చటం. అంటే, అనుమానాస్పద పౌరుల్ని గుర్తించి, వేరు చేసి, వారి హక్కులు తీసెయ్యటం జనాభా లెక్కల ప్రకారం1970లలో 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు వుండే వారు గానీ, వారి సంఖ్య 2011లో ఐదు లక్షలకి పడిపోయింది. 130కోట్ల జనాభాలో ఐదు లక్షల మంది ఎంత శాతం? వారిని కనుక్కోవటానికి వేల కోట్ల డబు, లక్షల మంది ఉద్యోగుల శ్రమ, కోట్ల మంది సమయం, ఖర్చు అవసరమా అనే ప్రశ్న అందరికీ వస్తోంది. అంతే కాక, దేశ రక్షణ విషయంలో పెద్ద పెద్ద స్కాంలు చేసేది అక్రమ వలసదారులు కాదనేది అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ చట్టం అమలు చొరబాటు దారులను తప్ప వేరే వారిని బాధించదని మిగతావారు ఎవరైనా సహజంగా పౌరసత్వం పొందుతారని హోం మంత్రి భరోసా ఇస్తున్నారు. కానీ గత ఐదేళ్ల అనుభవ రీత్యా, పౌరసత్వ చట్టంలో మొన్ననే తెచ్చిన సవరణ రీత్యా, పాలక పార్టీ వారి భీకరమైన ముస్లిం వ్యతిరేక ప్రసంగాల వల్ల ముస్లింలు ఈ భరోసాని నమ్మడానికి సిద్ధంగా లేరన్నది వాస్తవం. ఇక దళితులు, బహుజనులు, ఆదివాసీలు అందరు పౌరులుగా జాబితాలో చేరిపోతారని ముస్లిమేతరులు ఆందోళన పడవద్దని పాలక పార్టీ నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. పౌరసత్వ జాబితా అమలు పరంగానే కాక, భావనా పరంగానూ లోపభూయిష్టమయింది, ప్రమాదకరమైంది. అనంతమయిన వనరులున్న ప్రభుత్వం, వనరులు లేని అత్యధిక జనాభా ప్రజలని తాను అనుకుంటున్న పద్ధతుల్లో తమని తాము ఈ దేశ పౌరులుగా నిరూపించుకోమని, లేకుంటే అక్రమ వలసదారుగా పరిగణించి, బందిఖానాల్లో పెడతామనటం ఏ రకంగా న్యాయమైంది? ఆధార్, పాన్ కార్డులకి పౌరసత్వ జాబితాకు తేడా అదే. ప్రాతిపదిక స్పష్టం చెయ్యకుండా అనుమానాస్పద పౌరులని గుర్తించే అధికారం కింది స్థాయి ఉద్యోగులకివ్వటం, దాని ఆధారంగా అనుమానాస్పద పౌరులని శిక్షిస్తామనటం అన్యాయం కాదూ?
ప్రజలే జవాబుదారీనా...